Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్బీఐ అధికారి మంజు శర్మ
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైదరాబాద్ లోకల్ హెడ్ ఆఫీసులో బుధవారం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఆధార్ ఆధారంగా ముఖ గుర్తింపు టెక్నలాజీతో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్‌తో ఉపయోగంచుకునేలా దీన్ని రూపొందించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్హెచ్ఓ హైదరాబాద్ పీబీబీయూ డీజీఎం రవీందర్ గౌరవ్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎల్హెచ్ఓ హైదరాబాద్ ఎన్‌డబ్ల్యూ-1 జీఎం మంజు శర్మ మాట్లాడుతూ.. నూతన సౌలభ్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనాధికర లింక్‌లపై ఎవరూ క్లిక్ చేయకూడదని హెచ్చరించారు. వినియోగదారులు తమ పిన్, సాస్వర్డ్లను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు.