Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యానికి ల్యాండ్ మార్క్ 'మిల్లెట్ హౌస్'
- తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యం
- మొలకెత్తిన చిరు ధాన్యాలతో ఉత్పత్తుల తయారీ
- ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు: సంస్థ ఎండీ కార్తీక్
నవతెలంగాణ సిటీబ్యూరో / బంజారాహిల్స్
మంచి ఆరోగ్యం.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్కువ ఖర్చుతో ఆహారం అందిస్తోంది 'మిల్లెట్ హౌస్'.. మొలకెత్తిన చిరుధాన్యాలతో ఉత్పత్తులు తయారు చేస్తోంది. బీపీ, షుగర్, గ్యాస్టిక్, కీళ్లనొప్పులు, ఉబకాయం, పైల్స్, జీర్ణక్రియ సమస్యలు లేదా నీరసం, థైరాయిడ్, అస్తమా, జుట్టు రాలడం.. తదితర అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి.. పరిష్కారానికి సంజీవినిగా 'మిల్లెట్ హౌస్' కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండేండ్లలో దాదాపు 30లక్షల మంది వినియోగదారులు 'మిలెట్ హౌస్' ఉత్పత్తులను ఉపయోగించి సత్ఫలితాలు పొందారు. 'మిల్లెట్ హౌస్' దేశ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలను సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'మిల్లెట్ హౌస్' ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆ సంస్థ ఎండీ కార్తీక్ బుధవారం దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఉత్తమ రైతు అవార్డుల గ్రహీత తన తండ్రి డాక్టర్ మల్లూరు నాగరాజుతో కలిసి 2014లో కర్ణాటకలో 'మిలెట్ హౌస్'ను ప్రారంభించినట్టు తెలిపారు. తక్కువ సమయంలోనే లక్షల మంది వినియోగదారుల మన్ననలను పొందామన్నారు. అనంతరం ఆగస్టు, 2020లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 'మిల్లెట్ హౌస్'ను ప్రారంభించగా, దాదాపు 30లక్షల మంది తమ ఉత్పత్తులను వినియోగిం చారని, సత్ఫలితాలు సాధించారన్నారు. దేశంలోనే తొలి సారిగా నానబెట్టి మొలకెత్తిన జొన్నలు, రాగులు, బఠాణీ, గుమ్మడి గింజలతోపాటు తదితర చిరుధాన్యాలతో 'మిల్లెట్ హౌస్ మాల్ట్' ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్నారు. మిల్లెట్స్‌ను పొట్టుతీయకుండా మొలకలు వచ్చేవిధంగా ప్రత్యేకంగా తయారు చేస్తామన్నారు. ఎలాంటి రసా యనాలూ వినియోగించడం లేదని చెప్పారు. గోధుమలు, చెక్కర, పోయా లాంటివి ఉపయోగించకుండా సహజసిద్ధంగా పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేస్తున్నామని వివరించారు. వీటి నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చెప్పారు. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంపొందుతున్నారు. రెండేండ్లపై వయసు గల వారు తమ ఉత్పత్తులను వినియోగించొచ్చన్నారు. రూ.400 చెల్లిస్తే నెలకు సరిపడే 'మిల్లెట్ హౌస్ మాల్ట్' ఉత్పత్తులు పొందొచ్చని, ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ వేడి నీళ్లతో వాడితే సరిపోతుందన్నారు. తమ సంస్థ తయారు చేస్తున్న ఉత్పత్తులను, నాణ్యతను పరిశీలించిన డాక్టర్ ఖాదర్ వలీ ప్రత్యేకంగా అభినందించారన్నారు. పలు సలహాలు సూచనలు అందించారని తెలిపారు. డాక్టర్ ఖాదర్ వలీ మద్దతు లేదని కొందరు చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు. ప్రజానీకానికి మంచి ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో త్వరలో మరిన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
'మిల్లెట్ హౌస్ మాల్ట్' ఉత్పత్తులు అన్ని మండల కేంద్రల్లోని ఆర్గానిక్, కిరాణ దుకాణాలు, మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్లైన్లో సైతం ఆర్డర్ చేసుకోవచ్చని చెప్పారు. తమ ఉత్పత్తులను ఉపయోగించి మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. పోషక విలువలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన చిరుధాన్యాలతో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో 'శ్రీ చరణ కమ్యూనికేషన్స్' ఎండీ గుప్తాతోపాటు 'మిల్లెట్ హౌస్ మాల్ట్' ప్రతినిధులు కుమార్, గుప్తా, రాజ్‌కుమార్, సన్నీ ప్రసాద్, శ్రీకాంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.