Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్ కళాశాల ఎదుట బైటాయింపు
నవతెలంగాణ కంటోన్మెంట్
సికింద్రాబాద్లో ఓయూ అనుబంధ కళాశాలైన పీజీ కళాశాల వద్ద తమకు హాస్టల్ వసతి కల్పించాలని కోరుతూ బుధవారం యూజీ విద్యార్థులు రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు హాస్టల్ వసతి లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ క్రమంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి నాయకులు శివకుమార్, వేణు, ఆదిత్య, శివకుమార్, ఇతర విద్యార్థులను అరెస్టు చేసి బేగంపేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.