Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చే ఏడాది (2023)లో 28 సాధారణ, 24 ఐచ్ఛిక సెలవులుంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం సంబంధిత వివరాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం, రెండో శనివారాలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవుల(నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్)ను 23గా నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
2023లో వచ్చే సాధారణ సెలవుల వివరాలు
వేడుక /పండుగ తేదీ రోజు
1. న్యూఇయర్ జనవరి 1 ఆదివారం
2. భోగి జనవరి 14 రెండోశనివారం
3. సంక్రాంతి జనవరి 15 ఆదివారం
4. గణతంత్రదినోత్సవం జనవరి 26 గురువారం
5. మహాశివరాత్రి ఫిబ్రవరి 18 శనివారం
6. హోలి మార్చి 7 గురువారం
7. ఉగాది మార్చి 22 బుధవారం
8. శ్రీరామనవమి మార్చి 30 గురువారం
9. బాబుజగ్జివన్రామ్ జయంతి ఏప్రిల్ 5 బుధవారం
10. గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 7 శుక్రవారం
11. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 శుక్రవారం
12. రంజాన్ ఏప్రిల్ 22 శనివారం
13. రంజాన్ మరుసటిరోజు ఏప్రిల్ 23 ఆదివారం
14. బక్రీద్ జూన్ 29 గురువారం
15. బోనాలు జులై 17 సోమవారం
16. మొహర్రం జులై 29 శనివారం
17. స్వాతంత్య్రదినోత్సవం ఆగస్టు 15 మంగళవారం
18. శ్రీకృష్ణష్టామి సెప్టెంబర్ 7 గురువారం
19. వినాయకచవితి సెప్టెంబర్ 18 సోమవారం
20. ఈద్ మిలాద్ ఉన్ నబి సెప్టెంబర్ 28 గురువారం
21. గాంధీ జయంతి అక్టోబర్ 2 సోమవారం
22. బతుకమ్మ ప్రారంభం అక్టోబర్ 14 రెండోశనివారం
23. దసరా అక్టోబర్ 24 మంగళవారం
24. దసరా మరుసటిరోజు అక్టోబర్ 25 బుధవారం
25. దీపావళి నవంబర్ 12 ఆదివారం
26. కార్తీక పౌర్ణమి నవంబర్ 27 సోమవారం
27. క్రిస్మస్ డిసెంబర్ 25 సోమవారం
28. బాక్సింగ్ డే డిసెంబర్ 26 మంగళవారం