Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2 వేల గౌరవ వేతనం జీవోను ఇవ్వాలి
- తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెండింగ్లో ఉన్న 9,10 తరగతుల విద్యార్థులకు సంబంధించిన కోడిగుడ్ల బిల్లుల బకాయిలను చెల్లించాలనీ, సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన రూ.2 వేల గౌరవ వేతన జీవోను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.చక్రపాణి, ఎస్వీ.రమ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని విద్యాశాఖ కమిషనరేట్లో అధికారులకు వినతిపత్రం అంద జేశారు. కోడిగుడ్లకు అదనంగా నిధులు కేటాయించా లనీ, లేదంటే అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన మాదిరిగానే ప్రభుత్వమే ఇవ్వాలని కోరారు. కార్మికులకు డ్రెస్సులు ఇవ్వాలనీ, వంట షెడ్లు, వంట పాత్రలు, తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను ప్రయివేటు సంస్థలకు అప్పగించొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలా కార్మికులతో డీఈఓ జాయింట్ మీటింగ్ పెట్టి సమస్యలను పరిష్కరిం చేలా కృషి చేయాలని కోరారు. వంట చేసే కార్మికుల కు ప్రమాదబీమా, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాల ను కల్పించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రొసీడీంగ్ ఆర్డర్లు ఇవ్వాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.