Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
- జర్నలిస్టులూ కార్మికులే :
నవతెలంగాణ ఎడిటర్ ఆర్ సుధాభాస్కర్
- ఎస్వీకేలో హెచ్‌యూజే ఆరో మహాసభలు
నవతెలంగాణ-సిటీబ్యూరో/హైదరాబాద్ బ్యూరో
జర్నలిజం వృత్తి ఎంతో పవిత్రమైన వృత్తి అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో బుధవారం హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆరో మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. వృత్తి గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా జర్నలిస్టులు వ్యవహరించాలన్నారు. జర్నలిస్టులు సమాజ హితం కోసం తమ కలాన్ని, గలాన్ని వినియోగిస్తున్నారని కొనియాడారు. వృత్తిలో అనేక సమస్యలు, సాదక బాధకాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సమస్యల పట్ల ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. అన్నివర్గాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వం ధ్యేయం అన్నారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండటం సంతోషకరం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా గొప్పదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాంనగర్ చౌరస్తాలో దీక్షలు చేపట్టినట్టు గుర్తు చేశారు. జర్నలిస్టుల అభ్యున్నతికి, హెచ్‌యూజే సంఘం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని హామీనిచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో 64 జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చినట్టు గుర్తు చేశారు. జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. మరో అథితి నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్ మాట్లాడుతూ జర్నలిస్టులు కూడా కార్మికులే అన్నారు. ఈ యూనియన్ ట్రేడ్ యూనియన్ కింద రిజిస్టర్ అయిన సంఘం అని పేర్కొన్నారు. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు సామాజిక స్ప్రృహతో పని చేయాలన్నారు. జర్నలిజానికి చాలా పవర్ ఉందన్నారు. సంఘాలు పాలసీ ఇష్యూస్‌తో ఆలోచించాలన్నారు. ఈ రోజుల్లో యాజమాన్యానికి నొప్పి కలగకుండా రాసే వారు మంచి జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని తెలిపారు. ముఖేష్ అంబానీకి దాదాపు 70 ఛానెల్స్ ఉన్నాయనీ, ఇవన్నీ ప్రభుత్వాలకు అను కూలంగా పని చేస్తున్నాయని తెలిపారు. ఈ మధ్య కాలంలో అదానీ కూడా మీడియా రంగంలో ప్రవేశిం చారని చెప్పారు. మీడియా కొద్దిమంది కార్పొరేట్ల చేతిలోకి వెళ్లిందన్నారు. జనం సమస్యలు, బాధలను చూపించ కూడదు అని కొన్ని మీడియా సంస్థలు అనుకుం టున్నాయనీ, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రజల బాధలు, సమస్యలను వెలికితీయడానికి జర్నలిస్టులు ముందుకు అడుగేయాలని పిలుపు నిచ్చారు. దేశంలో మీడియాపై తీవ్ర దాడి జరుగు తుందన్నారు. జర్నలిస్టులు జనం సమస్యలను వెలికితీసి చూపించాలన్నారు.
ఉద్యమం చిన్నదైనా ఆ వార్తను హైలెట్ చేయాలన్నారు. నేడు దేశంలో పత్రికలు, వాటి పాత్ర ప్రమాదంలో ఉందన్నారు. జర్నలిస్టు యూనియన్లు వారి సమస్యలతోపాటు రోజు వారి సమస్యలపై కూడా దృష్టి సారిం చాలన్నారు. మీడియా రంగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. సమస్య చిన్నదైనా సరే మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హక్కుల సాధనతో పాటు ఇతర విషయాలపై పోరాడాలన్నారు. పత్రికా స్వేచ్ఛలో మన దేశం 157వ స్థానానికి దిగజారిం దన్నారు. ఈ కార్య క్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అద్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, నేషనల్ కౌన్సిల్ సెక్రెటరీ ఆనందం, కార్యదర్శులు నర్సింగరావు, పిల్లి రాంచందర్, సలీమ, హెచ్‌యూజే నాయకులు చంద్రశేఖర్, నిరంజన్, రాజశేఖర్, నవీన్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా వందల సంఖ్యలో జర్నలిస్టులు ఈ మహాసభలకు హాజరయ్యారు.
38 మందితో హెచ్‌యూజే నూతన కమిటీ..
ఈ మహాసభలో హెచ్‌యూజే నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా బి అరుణ్‌కుమార్ (వెలుగు), కార్యదర్శిగా బొల్లె జగదీశ్వర్ (నవతెలంగాణ), కోశాధికారిగా రాజశేఖర్ (ప్రజాశక్తి), ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పి నాగవాణి (వార్త), ఉపాధ్యక్షులుగా ఎం రమేశ్, జి రేణయ్య, వి కిష్టయ్య, పి సర్వేశ్వర్రావు, బి కాలేబ్, ఎస్ రమేశ్‌బాబు, జి వీరేష్, బి దామోదర్, ఆర్ రవితేజ, సీహెచ్ మధుకర్, జి నవీన్, సాగర్ వనపర్తిలు ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా పి బాలకృష్ణ, ఎస్ మాధవరెడ్డి, తలారి శ్రీనివాస్‌రావు, వి కిరణ్‌కుమార్, కె నరసింహ్మ, ఎ ప్రశాంత్, పి లక్ష్మణ్‌రావు, ఎం జీవన్‌రెడ్డి, డి శేఖర్లు ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్లుగా టి బ్రహ్మయ్య, కె లలిత, ఎస్ ప్రవీణ్‌కుమార్, టి రాజేశ్‌కుమార్, ఎం జహంగీర్, పీఎస్ ప్రతాప్, కె వెంకటస్వామి, శ్రీధర్ మురహరి, డీఎస్.సుభాష్ కృష్ణ, మహ్మద్ నిస్సార్, ముత్యాలు, హంసరాజు ఎన్నికయ్యారు.