Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన జీఎం అరుణ్‌కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ గురువారం సికింద్రాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం సభ్యులు విద్యార్థులకు అత్యుత్తమ క్రీడా సౌకర్యాలను కల్పించిందని చెప్పారు. టెన్నిస్, వాలీబాల్, రన్నింగ్ ట్రాక్, కబడ్డీ, ఖో-ఖో క్రీడలకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ జేకే జైన్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ రాజీవ్ కిషోర్, రాజారామ్, ఉషా జైన్, ఇతర రైల్వే అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. .