Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయండి
- సీఎం కేసీఆర్‌కు టీవీఈఏ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సుప్రీంకోర్టు ఆదేశాల అమల్లో భాగంగా విద్యుత్ సంస్థల్లో ఇప్పటికే పదోన్నతులు పొందిన తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది. సుప్రీం కోర్టు ఆదేశాల అమలు పేరుతో ఇచ్చిన రిజర్వేషన్లు, ప్రమోషన్లను రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతున్నదనీ, అలా జరక్కుండా అదనపు పోస్టులు, సూపర్‌న్యూమరీ పోస్టుల్ని క్రియేట్ చేయాలని ఆ లేఖలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎమ్ నెహ్రూ, ఎన్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. 2015 నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు రాష్ట్రాభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశారని ప్రస్తావించారు. ఆంధ్రా స్థానికత ఉద్యోగులకు సుప్రీం ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనే కారణంతో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేయోద్దని కోరారు.
అదనపు పోస్టులు, సూపర్‌న్యూమరీ పోస్టుల ఏర్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.