Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలని టీఏజేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఆ కమిటీ చైర్మెన్ ఎం మణిపాల్‌రెడ్డి, సెక్రెటరీ జనరల్ డి మల్లారెడ్డి, కో చైర్మెన్ సి జగదీశ్ నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పదోన్నతులను ఆఫ్‌లైన్‌లో, బదిలీలను వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా చేపట్టాలని కోరారు. 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను భవిష్యత్తులో వారి సొంత జిల్లాకు వచ్చేలా ప్రత్యేక జీవో ఇచ్చి న్యాయం చేయాలని సూచించారు. 13 జిల్లాల స్పౌజ్ టీచర్ల అప్పీళ్లను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఏజేఏసీ నాయకులు టి లచ్చిరాం, ఎ నరసింహస్వామి, టి రఘునందన్‌రెడ్డి, నర్సిములు, పి ఆదర్శరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.