Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు జీటీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంఈవో, డిప్యూటీ ఐవోఎస్, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ వంటి పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (జీటీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని గురువారం హైదరాబాద్‌లో ఆ సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్సీ అభ్యర్థి కాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మేరోజు బ్రహ్మచారి, అసోసియేట్ అధ్యక్షులు కె దశరథ్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. న్యాయపరమైన అంశాలను అధిగమించేందుకు త్వరలోనే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహిస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వి రమేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి డి గిరివర్ధన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎస్ నర్సింహారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.