Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అనాథ శవాలను మెడికల్ కాలేజీలకు అప్పగించాలని రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. అయితే అనాటమీ తరగతులు, పరిశోధనల కోసం మృతదేహాల కొరత తీవ్రంగా ఉన్నది. ఈ నేపథ్యంలో అనాథ శవాలను మెడికల్ కాలేజీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీజీపీ మహేందర్రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ మరణమై, ఆ మృతదేహాన్ని తీసుకుపోవడానికి ఎవరూ ముందుకు రాని సందర్భంలో మాత్రమే అన్ని రకాల న్యాయపర ప్రక్రియలు పూర్తి చేసి మృతదేహాలను మెడికల్ కాలేజీకి అప్పగించాలని స్పష్టం చేశారు. వాటికి ఎలాంటి పోస్ట్మార్టం నిర్వహించకుండా అప్పగించాలని సూచించారు. అన్ని జిల్లాల సూపరింటెండెంట్లు, కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ఈ విషయాన్ని గుర్తించి, వైద్యారోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.