Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడ ప్రతి ప్రాజెక్టులో ఎమ్మెల్యేలకు 30 శాతం కమిషన్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ముందుగా ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలన చూసి మాట్లాడాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ సవాల్ చేశారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి ప్రాజెక్టులో 30 శాతం కమిషన్ తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ పిచ్చి మాటలతో రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ఇప్పటికీ రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ, గొల్ల కురుమలకు బీజేపీ చేసిన మేలేంటో చెప్పాలని మునుగోడు బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. గొల్ల కురుమలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం మానుకోవాలనీ, లేదంటే రాజ్ గోపాల్ రెడ్డిని తరిమే రోజు వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే గొర్రెల కోసం ఏడు వేల మందికి రూ.93 కోట్లను బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని స్పష్టం చేశారు.