Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) ఏపీ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్, ఇండియానా యూనివర్సిటీ పర్డ్యూ యూనివర్సిటీ ఇండియానా పోలీస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో అధునాతన నానో మెటీరియల్స్, అప్లికేషన్స్‌పై మూడురోజులపాటు వర్చువల్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. నానోసైన్స్, టెక్నాలజీ రంగంలో పురోగతిని చర్చించేందుకు విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, జాతీయ, అంతర్జాతీయ కమ్యూనిటీలకు చెందిన ఇంజినీర్లను ఒకచోట చేర్చడం ఈ సదస్సు ముఖ్యఉద్దేశాన్ని వీఐటీ ఏపీ వర్సిటీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ డీన్ శాంతను మండల్, ఐయూపీయూఐ యూఎస్ఏ జనరల్ కో చైర్కాన్ఫరెన్స్ మంగీలాల్ గురువారం వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ఐఆర్ డైరెక్టర్ డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నానోటెక్నాలజీలో పురోగతి గురించి తెలుసుకునేందుకు ఇలాంటి సదస్సు దోహదపడుతుందని చెప్పారు. వీఐటీ ఏపీ వర్సిటీ వీసీ ఎస్వీ కోటారెడ్డి మాట్లాడుతూ పరిశోధన, పబ్లికేషన్, పేటెంట్లు, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్‌లు, పరిశ్రమలతో ఎంవోయూలు, ప్లేస్మెంట్లు, మౌలిక సదుపాయాలు, ర్యాంకింగ్‌లో సాధించిన విజయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ జగదీశ్ సి ముదిగంటి తదితరులు పాల్గొన్నారు.