Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్‌కు సంతోష్‌కుమార్ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కనీస నిబంధనలను అమలు చేయని గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎం మంజూర్ హుస్సేన్‌ను గురువారం ఆయన కలిసి ఫిర్యాదు చేశారు. గురునానక్ కాలేజీలో జరిగిన ఘటనపై విచారణ చేపట్టాలని కోరారు. బీవీఆర్ఐటీలో పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ ప్రిన్సిపాల్ నియామకం ఘటనపైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన రిజిస్ట్రార్ ఆయా కాలేజీలకు నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతామనీ, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.