Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవపున్నయ్య వెల్లడి
- జయప్రదం చేయాలంటూ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈనెల 27న హైదరాబాద్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభలు నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి. బసవపున్నయ్య తెలిపారు. 27న ఉదయం 10 గంటలకు జర్నలిస్టుల మహా ప్రదర్శన జరుగుతుందనీ, అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ప్రత్యేక సమావేశంలో వారు మాట్లాడుతూ... జర్నలిస్టుల సమస్యలపై టీడబ్యూజేఎఫ్ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నదన్నారు. రాష్ట్రంలో మొదటి ట్రేడ్ యూనియన్‌గా ఫెడరేషన్ ఏర్పడిందనీ, అన్ని విషయాల్లో జర్నలిస్టులకు అండగా నిలుస్తున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహాసభలు నిర్వహించి సంఘ నిర్మాణాన్ని బలోపేతం చేశామని చెప్పారు. 27న హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో ఫెడరేషన్ రాష్ట్ర ద్వితీయ మహాసభల నిర్వహణకు సన్నాహాలు జరుగుతు న్నాయన్నారు. మహాసభల్లో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పలువురు ఎడిటర్లు పాల్గొం ఓటారని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామన్నారు. సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, పిల్లి రాంచందర్, తాటికొండ కృష్ణ, కార్యదర్శి సలీమా, కోశాధికారి ఆర్. వెంకటేశ్వర్లు, హెచ్ యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీశ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మెరుగు చంద్రమోహన్‌తో పాటు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.