Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన సచివాలయ నిర్మాణంపై సీఎం సంతృప్తి
- పనుల పరిశీలన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతూ, గుణాత్మకంగా ఉండ బోతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. అక్కడి నిర్మాణ పనులను గురువారం పరిశీలించిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. సచివాలయంలోని విశాలవంతమైన కారిడార్లను, ఛాంబర్లను పరిశీలించారు. మంత్రులు, వారి సిబ్బంది ఒకే చోట విధులు నిర్వర్తించేలా వాటిని నిర్మిస్తున్నామని వివరించారు. క్యాంటీన్లను, సమావేశ మందిరాలను పరిశీలించిన సీఎం అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేశారు. వాహనాల రాకపోకలకు అనుగుణంగా తను సూచించిన విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా ? లేదా..? అనే విషయాన్ని ఆయన నిర్దారించుకున్నారు. ఇటీవలే బిగించిన డోమ్‌లను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రాంగణంలో హెలీప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించిన సీఎం అనువైన చోట దాని నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు.