Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఆస్కీ' సదస్సులో ఎల్వీప్రసాద్ ఆస్పత్రి చైర్మెన్ జీ నాగేశ్వరరావు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారత దేశంలో 56 శాతం మంది ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం డబ్బు ఖర్చు చేయలేరనీ, కానీ అందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించడం సమాజం బాధ్యత అని ఎల్వీ ప్రసార్ ఐ ఇన్స్టిట్యూట్ చైర్మెన్ గుళ్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) ఆధ్వర్యంలో గురువారం 'సార్వత్రిక ఆరోగ్యం-ఒక నమూనా' అంశంపై ఆయన డాక్టర్ వీ చంద్రమౌళి స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో వివిధ వర్గాలకు అందిస్తున్న వైద్య సేవల్ని ఉదాహరణలుగా పేర్కొంటూ ఉపన్యసించారు. పౌరులందరికీ సరసమైన, జవాబుదారీతో కూడిన సముచితమైన, నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను అందించాలని విశ్లేషించారు. దేశంలో అంధత్వం అనేది అతిపెద్ద సమస్య అని చెప్పారు. ఆధునిక సాంకేతికను వినియోగించుంటూ మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైన వైద్యాన్ని అందిచవచ్చని ఉదహరించారు. తమ సంస్థ పల్లె ప్రాంతాల్లోనూ విజన్ సెంటర్లు ఏర్పాటు చేసి, డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, కంటి ఆరోగ్య ప్రమోషన్, స్క్రీనింగ్ ప్రోగ్రామ్లు, రెఫరల్స్, రిఫరల్స్లో విజన్ గార్డియన్లను ఉపయోగించడం వంటి కార్యకలాపాల ద్వార సేవలను ఎలా విస్తరింపజేస్తున్నదని ఉదాహరించారు. స్మారకోపన్యాసానికి ఆస్కీ చైర్మెన్ కే పద్మనాభయ్య, ఇంచార్జి డైరెక్టర్ జనరల్ డాక్టర్ నిర్మల్య బాగ్చి తదితరులు పాల్గొన్నారు.