Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో న్యాయవాదుల నిరసన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీకి సుప్రీంకోర్టు ప్రతిపాదన చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ) ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించారు. బదిలీ ఉత్తర్వుల ప్రతిపాదనను రద్దు చేసే వరకు నిరసన వ్యక్తం చేస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. హెచ్‌సీఏఏ అధ్యక్షులు వి.రఘునాథ్ మాట్లాడుతూ.. బదిలీ ద్వారా న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా చేస్తున్నారనీ, ఏకపక్షంగా బదిలీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ నిర్ణయాన్ని రద్దు చేయాలన్నారు.
హైకోర్టులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయి కోర్టుల్లో న్యాయవాదులు విధులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. జస్టిస్ అభిషేక్‌రెడ్డి బదిలీని ఆపాలంటూ హెచ్‌సీఏఏ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. తర్వాత హైకోర్టు వద్ద రాస్తారోకో చేశారు.