Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కుమార్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా అధ్యక్షులు, మోర్చాల నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఆర్ఎస్ నేతల అరాచకాలను తిప్పి కొట్టేలా నిరసనలు కొనసాగించాలని సూచించారు. ఎంపీ అర్వింద్ తల్లిని భయభ్రాంతులకు గురి చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిరికిపందల చర్య : తరుణ్‌చుగ్
నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కుమార్ ఇంటిపై దాడి పిరికిపందల చర్య అని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీఆర్ఎస్ రాజ్యాంగవిరుద్ధంగా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
నిఘా విభాగం ఎక్కడీ : లక్ష్మణ్
ఎంపీ అర్వింద్‌కుమార్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తుంటే రాష్ట్రంలో నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు.