Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీకి గవర్నర్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎంపీ ఇంటిపై దాడి, ఆయన కుటుంబ సభ్యులను బెదిరించడం, వారు సహాయం కోసం అర్థించడం తీవ్రంగా ఖండించదగిన అంశాలని ఆమె పేర్కొన్నారు. దీనిపై నివేదిక సమర్పించేందుకు ప్రాధాన్యతనివ్వాలని డీజీపీని కోరారు.