Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : పోలీసు శాఖపై బీజేపీ ఎంపీ డి. అరవింద్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై అధికారులు గుర్రుగా ఉన్నారు. నిజామాబాద్‌లోని తన నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయటంపై ఆగ్రహం చెందిన అరవింద్.. ఇక్కడి పోలీసులు పూర్తిగా అమ్ముడు పోయారనీ, తన నివాసంపై దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారని ఆయన విమర్శించారు. అంతేగాక, రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఏ విషయమూ పట్టించుకోవటం లేదనీ, ఇంతటి యూజ్లెస్ డీజీపీని తానెప్పుడూ చూడలేదని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పోలీసు శాఖలోని కొందరు సీనియర్ అధికారులతో పాటు పోలీసు అధికారుల సంఘం కూడా గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. అరవింద్ వ్యాఖ్యలపై కొందరు సీనియర్ పోలీసు అధికారుల మధ్య వాడివేడి చర్చ కూడా సాగినట్టు తెలిసింది. ఈ వ్యాఖ్యలకు ప్రతిగా ఏ విధంగా స్పందించాలనే విషయమై సీనియర్ పోలీసు అధికారులు తీవ్రంగా యోచిస్తున్నట్టు సమాచారం.