Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ పరుపుల కంపెనీ పెప్స్ ఇండిస్టీస్ దేశ వ్యాప్తంగా తన గ్రేట్ స్లీప్ స్టోర్లను 130కి విస్తరించింది. శుక్రవారం తన నూతన స్టోర్‌ను హైదరాబాద్‌లోని నాగోల్‌లో తెరవడం ద్వారా ఈ మైలురాయికి చేరామని పెప్స్ ఇండిస్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ కె మాధవన్ తెలిపారు. ఈ స్టోర్ ప్రారంభోత్సవంలో ఆయనతో పాటు వైస్ ప్రెసిడెంట్ సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ఈ స్టోర్ మాట్రసెస్ ఎంపికకు అత్యంత అనుకూలంగా ఉంటుందన్నారు. పరుపుల టచ్ అండ్ ఫీల్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. హైదరాబాద్‌లో తమకు ప్రస్తుతం ఆరు స్టోర్లు ఉన్నాయని.. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 15 స్టోర్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.