Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏమైంది?: టీఆర్ఎస్ నేతల విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య విమర్శించారు. శుక్రవారంనాడిక్కడి టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 8 ఏండ్ల మోడీ పాలనలో బీసీలకు ఒరిగిందేం లేదన్నారు. ఆపార్టీలో ఓబీసీ శాఖ ఉంటుందనీ, దానికి అధ్యక్షుడిగా డాక్టర్ కే లక్ష్మణ్ ఉన్నారనీ, మరి కేంద్రప్రభుత్వంలో బీసీ మంత్రిత్వశాఖ ఎందుకు లేదని ప్రశ్నించారు. బీసీలకు బీజేపీ బియ్యపు గింజంత మేలు కూడా చేయలేదని ఎద్దేవా చేశారు.
బీసీ జనగణన విషయంలోనూ ఆపార్టీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. కానీ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల కోసం 300కు పైగా గురుకులాలు ఏర్పాటు చేశారని చెప్పారు. అలాగే బీసీ విద్యార్థులకు ఉద్యోగాల సాధన కోసం భారీగా బీసీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయక పోగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తూ, వారి రిజర్వేషన్లకు గండి కొడుతున్నదని విమర్శించారు. బీసీ పారిశ్రామిక వేత్తలపై కేంద్రం కక్ష గట్టి ఈడీతో దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు.