Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎంపీ అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎంపీ స్థానంలో ఉండి ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అవమానకరంగా మాట్లాడడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని తెలిపారు. తెలంగాణకే అవమానకరంగా ఆయన ప్రవర్తన ఉందని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో ఆయన తన స్థాయి మరిచి మాట్లాడారని గుర్తు చేశారు. చివరకు సీఎంను కూడా అనరాని మాటలు అంటున్నారని తెలిపారు. నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పార్లమెంట్లో తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఆయన ఏనాడు మాట్లాడలేదని విమర్శించారు.