Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో బీజేపీ రిట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేల ఎర కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన నోటీసుల అమలును నిలిపివేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. కేసుతో సంబంధం లేని వారికి నోటీసు జారీ చేస్తున్నారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సిట్ దర్యాప్తును గోప్యంగా ఉంచాలన్న హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సిట్ వ్యవహారం ఉందనీ, నిందితుల పేర్లను, నోటీసుల వివరాలను మీడియాకు వెల్లడించిందని తెలిపారు.
లాయర్ల ఆందోళన
న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డిని పాట్నా బదిలీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం హైకోర్టులో లాయర్లు ఆందోళన కొనసాగించారు. విధులను బహిష్కరించారు. బదిలీ ప్రతిపా దనను వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు సీజే, కేంద్ర లా మంత్రి, లా సెక్రటరీలకు శనివారం వినతిపత్రాలు అందజే స్తామని హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునాథ్ చెప్పారు.