Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ యేతర శక్తులతో జట్టు కడతాం..
- సీఎం కేసీఆర్ మద్దతు కోరతాం..
- పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాల్సిందే: విలేకర్ల సమావేశంలో మందకష్ణ మాదిగ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోసం కార్యాచరణ చేపడుతామన్నారు. తమ డిమాండ్‌కు ప్రారంభం నుంచి బీజేపీ మద్దతు ఇస్తున్నదీ..అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఎందుకు పనిచేయటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లును పెట్టేవిధంగా బీజేపీ యేతర పక్షాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ మోసాన్ని సాగనివ్వబోమనీ, మాదిగల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటామని చెప్పారు.ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ వాటి అనుబంధ సంఘాల జాతీయ మహాసభల అనంతరం కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక పోరాట కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఇందులో భాగంగా వామపక్ష పార్టీల కేంద్ర, రాష్ట్ర నాయకులను ప్రత్యక్షంగా కలుస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం వరసగా అమ్మే స్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలన్నీ కార్పొరేట్ల పరమైతే..ఇక రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బడుగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతా యన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీ కరణకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్య మం చేపడతామని తెలిపారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరి శ్రమను ప్రయివేేటీకరించడం సిగ్గు చేటన్నారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెట్టడానికే కేంద్రం పనిచేస్తోందని విమర్శించారు. అభి వృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో విద్య, వైద్య రంగం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయనీ, మన దేశంలో మాత్రం వాటిని ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు.