Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయ్యప్ప మాలధారుడికి కేరళ మంత్రి రాధాకృష్ణన్ వైద్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అయ్యప్ప మాలేసుకుని తెలంగాణ నుంచి శబరిమలకు బయల్దేరిన ఓ భక్తుడు కేరళ చేరుకున్నారు. అక్కడి అయ్యప్ప దర్శనానికి వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో అతడు తీవ్రంగా నీరసించాడు. కాలు బెణకటంతో నడవలేక నానా ఇబ్బందీ పడ్డాడు. ముందుకు కదల్లేని పరిస్థితుల్లో మిన్నకుండిపోయాడు. ఈ క్రమంలో అటుగా వెళుతున్న కేరళ దేవాదాయ శాఖ మంత్రి కెకె రాధాకృష్ణన్... తన కారు దిగి స్వయంగా ఆ భక్తుడి వద్దకు వెళ్లి పరిస్థితిని ఆరా తీశారు. తనకు తెలిసిన ఆయుర్వేదంతో ఆయన కాలుకు స్వయంగా సపర్యలు చేసి.. వైద్యమందించారు. కొన్ని మందులు తెప్పించి ఇచ్చారు. ఆ భక్తుడికి ఉపశమనం కలిగాక అక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచేగాక ఎక్కడి నుంచి వచ్చే అయ్యప్ప భక్తులైనా ఎలాంటి అసౌకర్యం కలిగినా తమ అధికారుల దృష్టికి తీసుకొస్తే... సత్వరమే సమస్యకు పరిష్కారం చూపుతామని రాధాకృష్ణన్ ఈ సందర్భంగా తెలిపారు.