Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరవింద్‌కు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ తీరు పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఆడబిడ్డలప రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. కల్వకుంట్ల కవితపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోకపోతే నాలుక కోస్తామని హెచ్చరించారు. పసుపు బోర్డు పేరుతో ఓట్లు వేయించుకుని అరవింద్ ఆ హామీని గాలికొదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలతో తనకు నిత్య సంబంధాలున్నట్టు అరవింద్ ఒప్పుకున్నారని విమర్శించారు. అరవింద్ తన తల్లిని సైతం రాజకీయాల్లోకి లాగడం దౌర్భాగ్యమన్నారు.