Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాజిరెడ్డి గోవర్థన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ ప్రతి ఆర్టీసీ ఉద్యోగిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. ఇప్పటి వరకు గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా 20,000 ఉద్యోగుల హెల్త్ ప్రొఫైల్స్ పూర్తి చేశారని తెలిపారు. ప్రత్యేక యాప్ తో వైద్య సేవలు, ప్రతి ఉద్యోగి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాన్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలలో, యూనిట్లలో ప్రత్యేకంగా హెల్త్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించుతూ సిబ్బంది ఆరోగ్య సమస్యలపై మార్గ నిర్దేశం చేస్తున్నట్టు వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తార్నాక ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడం శుభ పరిణామన్నారు. ఆరోగ్య సంక్షేమంలో భాగంగా కొనసాగుతున్న హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమంలో 4,898 మంది మహిళా ఉద్యోగినీలతో సహా 50 వేల మందికిపైగా ఉన్న సిబ్బందికి వైద్య పరీక్షల నిర్వహణ కోసం అన్ని రీజియన్లలో 25 వైద్య బృందాలు పాల్గొని సేవలందిస్తున్నాయన్నారు. ఎవరైతే ఆరోగ్య పరీక్షల్లో ఎమర్జెన్సీ లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స కోసం చేర్చడం జరుగుతుందని చెప్పారు. తార్నాక ఆస్పత్రిలో 24 గంటల ఫార్మసీ, డయాగస్టిక్ సేవలు కార్డియాలజీ, నేఫ్రాలజీ, గైనిక్ సేవల కోసం పూర్తిస్థాయి సిబ్బంది పని చేస్తున్నదని చెప్పారు. ఈసీజీ, ఐసీయూ సేవలు అందుబాటులోకి రావడంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రయివేటు ఆస్పత్రులను కాకుండా సంస్థ సిబ్బందిని నిమ్స్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నట్టు తెలిపారు. తార్నాక ఆస్పత్రికి గతంతో పోలిస్తే ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే ఉద్యోగులు, బయట నుంచి వచ్చేవారు (ఔట్ పేషెంట్స్) పెరుగుతున్నారని చెప్పారు.