Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా కమిషన్, పోలీసులకు టీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఎంపీ అరవింద్‌పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు మహిళా విభాగం నాయకులు ముక్తవరం సుశీలారెడ్డి శనివారం ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అరవింద్ అభ్యంతరకరంగా, అసభ్యంగా వ్యాఖ్యాలు చేశారని ఆరోపించారు. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు లీలా, సువర్ణారెడ్డి, గీతా గౌడ్, ఉమావతి, ప్రభారెడ్డి, సుజాతాగౌడ్, ప్రీతిరెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు.