Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి
- పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డిసెంబర్ మూడున ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని మహిళా,శిశు వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకంలోనూ ఎస్సీ వర్గాలకు చెందిన వికలాంగులకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రం చూపించని ఆదరణను వారి పట్ల తమ ప్రభుత్వం కనబరుస్తున్నదన్నారు. వికలాంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సదుద్దేశంతో చూడాలన్నారు. వికలాంగులు ప్రతిపాదించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవ ఏర్పాట్ల కోసం ప్రతి జిల్లాకు రూ.50 వేలను విడుదల చేసినట్టు తెలిపారు.కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మెన్ వాసుదేవ రెడ్డి శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్, డైరెక్టర్ శైలజ వికలాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.