Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- మంత్రికి సీపీఎస్, పెన్షన్ సాధన కమిటీ వినతిపత్రం
నవతెలంగాణ- ఓయూ
ఓయూ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఓయూలో బాలుర హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు శనివారం క్యాంపస్‌కు వచ్చిన మంత్రికి సీపీఎస్, పెన్షన్ సాధన కమిటీ సభ్యులు తమ సమస్యలను వివరించారు. 20 ఏండ్లుగా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. వీటన్నింటిపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. సమస్యలను సావధానంగా విన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సీపీఎస్ అమలుతోపాటు పీఆర్సీ బకాయిలు త్వరలోనే ఇప్పించేం దుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్య క్రమంలో సీపీఎస్ సాధన కమిటీ నుంచి ప్రొ.సూర్య దనుంజయ్, ప్రొ.మల్లేశం, ప్రొ.సార స్వతమ్మ, డా.చెలమల్ల శ్రీని వాసు, డా. రాధాకృష్ణ, ప్రొ.శశికాంత్, డా.సీహెచ్. వెంకటేశ్వర్లు, డా. బి.రవీందర్ రెడ్డి, డా. జె.వెంకటేశ్వర్లు, మేది శ్రీనివాస్, ఓయూ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, టెక్నికల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, నాగ రాజు, ఓయూ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అక్బర బేగ్, విజరు కుమార్, రవి, భూంరావ్ తదితరులు పాల్గొన్నారు.