Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ ఎస్వీకేలో మూడు రోజులపాటు నిర్వహణ
- తరలిరానున్న కవులు, సాహివేత్తలు, రచయితలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'పాటకు జేజేలు' పేరిట హైదరాబాద్ నగరంలో మూడు రోజులపాటు కవులు, రచయితలు, సాహితీవేత్తలు సమాలోచనలు జరపనున్నారు. పాటలోని వైవిధ్యం, విభిన్నత, సృజనాత్మకతల గురించి వారు చర్చించనున్నారు. నగరంలోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రం అందుకు వేదిక కానుంది. 'తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్ -2022' ఆదివారం ఇక్కడి ఎస్వీకేలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ ఫెస్ట్ మూడు రోజులపాటు కొనసాగనున్నది. ఈ క్రమంలో కవి గాయకుల సమ్మేళనం, సినిమా పాటల్లోని సాహిత్యంపై చర్చా గోష్టులను నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా వాగ్గేయకారులు, పాటల రచయితలు, కవులు, విమర్శకులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి తెలిపారు.
పాటలు, వాటి నేపథ్యం, కవుల పరిచయం, అభినందనలు తదితర కార్యక్రమాలను మూడు రోజులపాటు నిర్వహిస్తామని వెల్లడించారు. సినిమా పాటల సాహిత్యంపై పరిశోధకులతో సదస్సులు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఫెస్ట్‌ను ప్రారంభిస్తామని వివరించారు. ఫెస్ట్‌కు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కవులు, రచయితలు, సాహితీవేత్తలకు ఆయన పిలుపు నిచ్చారు.