Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్ల కోసం దీక్షలు
- డిసెంబర్ 5న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
- ఈ నెల 21న సీఎస్‌కు వినతిపత్రం
- కార్యాచరణ ప్రకటించిన రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజాసమస్యలపై ప్రజాపోరు బాట పట్టాల్సిన అవసరముందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. తెలం గాణలో పోడు భూములు, ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్ట బోతున్నదని పిలుపునిచ్చారు. ఈ పోరాటాలను చాలా కీలకంగా భావించి పని చేయాలని కోరారు. సీఎల్పీనేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కిసాన్‌సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, సీనియర్ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్‌అలీ, అన్వేష్‌రెడ్డి, ప్రీతం, అయోధ్యరెడ్డి తదితరులతో కలిసి శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రేవంత్ జూమ్ సమావేశంలో మాట్లాడారు.కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న పోడు భూములు, భూమికి సంబంధించిన ఇతరాంశాలు, ధరణి పోర్టల్, ఓబీసీ, ఈ ఏడాది వానాకాలం మార్కెటింగ్ సీజన్లో ధాన్యం సేకరణ, క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులపై చర్చించారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమిపై సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సమస్యలపై పోరాడాల్సిన అవసరముందని చెప్పారు. ప్రకృతి విపత్తుల కారణంగా 15లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారంతోపాటు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములను సీలింగ్ ల్యాండ్ పేరిట ప్రభుత్వం పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా టీఆర్ఎస్, బీజేపీ నాటకాలాడుతున్నాయని విమర్శించారు. గతంలో కూడా నయీం కేసు, మాదక ద్రవ్యాల కేసు, ఆర్టీసీ కార్మికుల ధర్నా వంటి అంశాలను వివాదాస్పదం చేశారని గుర్తు చేశారు.
తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయాలు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయాలు చేయాలనుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకం కింద 47లక్షల మందికి రూ.25వేల కోట్లు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఇక నుంచి అన్ని మండల కేంద్రాలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు దీక్ష చేపట్టాలని తెలిపారు. దశల వారీగా పోరాటాలు చాలా అవసరమనీ, వ్యవసాయం, రైతుల అంశాలు ఇప్పుడు చాలా కీలకమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. తొలుత నియోజకవర్గాల్లో పోరాటాలు చేసి రైతులు, ఇతర వర్గాల నుంచి అభిప్రాయాలు, డిమాండ్లపై సీఎస్ దష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించాలన్నారు. 32 జిల్లాల్లో ఆందోళనలు చేసిన తర్వాత గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్టు చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో, భారత్ జోడో యాత్ర కోసం కష్టపడి పనిచేశారంటూ అభినందించారు.