Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడిదారులకు అప్పగించే ప్రయత్నాలు
- విద్యుత్ సంస్కరణలు ప్రజలపై తీవ్రమైన ప్రభావం :సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్
- అన్‌మ్యాన్ కార్మికులకు కనీస వేతనాలివ్వాలి :టీఎస్‌యూఈఈయూ నూతన రాష్ట్ర అధ్యక్షులు
కె.ఈశ్వర్ రావు
- ముగిసిన తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ మహాసభలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలో ఆర్థిక సంస్కరణలను పాలకులు చాలా వేగంగా అమలు చేస్తున్న సంస్కరణలు సాధారణ ప్రజానీకంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ తెలిపారు. తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌యూఈఈయూ) రాష్ట్ర 3వ మహాసభలు హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఎస్.కె గార్డెన్లో (సున్నం రాజయ్యనగర్) ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ.. విద్యుత్ రంగాన్ని పెట్టుబడిదారులకు అప్పగించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేస్తూ పలు ఆర్డినెన్స్‌లను తీసుకువస్తున్నదన్నారు. ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థలకు గొడ్డలి పెట్టులాంటి విద్యుత్ సవరణ బిల్లు-2022ని విద్యుత్ కార్మికులు, ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
35మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక
ఈ మహాసభలో టీఎస్‌యూఈఈయూ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా కె.ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వి.గోవర్ధన్, గౌరవ అధ్యక్షులుగా వి.కుమార చారి, ఉపాధ్యక్షులుగా కె.మధు, కె.వెంకటనారాయణ, కె. నాగేశ్వరరావు, ఆర్.వెంకటేశ్వరరావు, ఉప ప్రధాన కార్యదర్శులుగా బి.వెంకటరాజు, జె.ప్రసాదరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా జి.సుధాకర్, జి.రవీంద్ర ప్రసాద్, జాయింట్ సెక్రటరీలు ఎస్.రవీందర్, జె.శశికళ, ఏ.నరసింహారావు, కోశాధికారిగా జె.బసవరాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షకా ర్యదర్శులు మహాసభలో చేసిన పలు తీర్మానాలను వివరించారు. రాష్ట్ర విద్యుత్ యాజమాన్యం ఉద్యోగులకు నూతన వేతన సవరణ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికులకు అర్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని కోరారు. 1999 తర్వాత నియమితులైన విద్యుత్ ఉద్యోగులందరికీ జీపీఎఫ్ అమలు చేయాలన్నారు. సంస్థలో మిగిలి ఉన్న 6,500 మంది పీస్ రేట్, అన్‌మ్యాన్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ మ్యాన్ కార్మికులను ఆర్టిజనులుగా గుర్తించాలని తీర్మానం చేశారు. సర్వీసులకు అనుగుణంగా ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని, కారుణ్య నియామకాలలో పాత పద్ధతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ కార్మికులకు అన్ లిమిటెడ్ మెడికల్ క్రెడిట్ కార్డు ఇవ్వాలన్నారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తీర్మానం చేశారు. 2011 బ్యాచ్ జేఎల్ఎంలకు జాయినింగ్ తేదీ నుండి ఎరియర్స్ చెల్లించాలని, ఎన్పీడీసీఎల్లో తొలగించిన ఏపీటీఎస్ సెక్యూరిటీ గార్డులను తిరిగి విధులలోకి తీసుకోవాలని పలు తీర్మానాలు చేశారు.