Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అయినేని సంతోష్ కుమార్ : టీఎస్ టీసీఇఏ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అయినేని సంతోష్ కుమార్ ను బరిలో నిలుపనున్నట్టు టీఎస్ టీసీఇఏ తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఆ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శులు దాసరి శ్రీనివాస్, బి.అనంతరామ్, కార్యదర్శి కె.రాజు ఈ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ''సంతోష్ కుమార్ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం కొన్నేండ్లుగా పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీలు ఏమి చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. కొన్నేండ్లుగా ప్రయివేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ ప్రయివేటు ఉన్నత విద్యసంస్థల్లో (ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసిఏ..) అధ్యాపకులు, పాఠశాల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రయివేటు పాఠశాల్లో, జూనియర్ కాలేజ్లో పని చేస్తున్న ఉద్యోగులతో వివిధ పనులు చేయిస్తూ వారిని శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని'' విమర్శించారు.ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల, జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్, ఆయా యూనివర్సిటీ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాననీ అభ్యర్థి సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు. విద్య వ్యవస్థ మార్పు కోసం,ఉ ద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి ఆశీస్సులు, సహకారం ఉండాలనీ, ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.