Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి కార్మికుల సమాఖ్య విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇఛ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని మునుగోడు ఆర్టీసీ కార్మికుల సమాఖ్య డిమాండ్ చేసింది. వేతన సవరణ, కార్మిక సంఘాల అనుమతి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరింది. మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం చౌటుప్పల్‌లో చైర్మెన్ కే రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. కన్వీనర్ ఎమ్వీ చారి, ముఖ్య సలహాదారు బీజేఎమ్ రెడ్డి, వైస్ చైర్మెన్లు ఈ శంకరయ్య, కత్తుల యాదయ్య, సుర్కంటి మోహన్‌రెడ్డి, కో కన్వీనర్ కొవ్వూరు యాదయ్య, కోశాధికారి కే రామదాసు,ప్రచార కార్యదర్శి బీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీల రద్దు, యూనియన్ల కార్యకలాపాలకు అనుమతి, వేతన సవరణలు, పాత బకాయిల చెల్లింపు, సంపూర్ణ ఉద్యోగ భద్రత సహా పలు డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయాలపై సమావేశంలో చర్చించారు. మంత్రులు కే తారకరామారావు, హరీశ్‌రావు, పువ్వాడ అజరుకుమార్, ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ తదితరులు ఈ మేరకు హామీలు ఇచ్చినట్టు గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి, సమస్యలు పరిష్కరిస్తామని వారు చెప్పారనీ, ఆ దిశగా కొన్ని హామీలు నెరవేర్చినట్టు పేర్కొన్నారు. మిగిలిన డిమాండ్ల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎలక్షన్ కోడ్ ముగిసి 20 రోజులు గడిచినా ఇంకా వేతన సవరణపై నిర్ణయం ప్రకటించకపోవడం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ విషయంలో మంత్రులు తక్షణం జోక్యం చేసుకొని వేతన సవరణకు చర్యలు చేపట్టాలని కోరారు.