Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పాలడుగు భాస్కర్, జనగం రాజమల్లు
- కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎర్ర నర్సింహులు, మహిళా కన్వీనర్‌గా వి.నాగమణి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పాలడుగు భాస్కర్, జనగం రాజమల్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హన్మకొండలో జరిగిన ఆ యూనియన్ నాలుగో రాష్ట్ర మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. 88 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పడింది. అందులో ఆఫీస్ బేరర్లుగా 31 మంది ఉన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎర్ర నర్సింహులు, కోశాధికారిగా జక్కల రవికుమార్, మహిళా కన్వీనర్‌గా వి.నాగమణి, కార్యదర్శులుగా పాలడుగు సుధాకర్, తుమ్మ విష్ణువర్ధన్, జన్ను ప్రకాశ్, రాజనర్సు, గోవర్ధన్, వెంకటస్వామి, డి.కిషన్, సిహెచ్.రవి, డి.పాండు, నవనీత, సత్యం, జె.వెంకటేశ్, ఎం.శ్రావణ్‌కుమార్, జి.యాదమ్మ, హంసమ్మ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఈ.అంజయ్య, బుజ్జమ్మ, ఆర్.వాణి, జి.అశోక్, ఉప్పలయ్య, ఎ.వెంకటేశ్, బాలనర్సింహ్మ, జనక శ్రీను, జయరాం, నెమ్మాది వెంకటేశ్వర్లు, జ్యోతి, పెరికె అంజమ్మ ఉండనున్నారు.