Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు
నవతెలంగాణ-సంతోష్‌నగర్
హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో గుడిసెవాసులు ఉన్నచోటనే పక్కా ఇండ్లు నిర్మించి పట్టాలివ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు, హైదరాబాద్ సౌత్ కార్యదర్శి ఎండీ అబ్బాస్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి గుడిసె వాసులతో కలిసి కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 25 ఏండ్ల నుంచి కాలనీలోని గుడిసెల్లో నివసిస్తున్నా ఇప్పటివరకు ఏ ప్రభుత్వం నుంచి వారికి లబ్ది చేకూరలేదన్నారు. పైగా ఆ ప్రాంతంలో ఉన్న సొసైటీ వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఆ ప్రాంతంలో అపార్ట్మెంట్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. గుడిసె వాసులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ కమిటీ సభ్యులు బాలు నాయక్, విఠల్, కోటయ్య, నాగేశ్వర్, శ్రావణ్ కుమార్, శశికళ, మీసాల లక్ష్మమ్మ, అబ్దుల్ లతీఫ్, సత్తార్, తదితరులు పాల్గొన్నారు.