Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సుంకోజు కృష్ణమాచారి, రాళ్లబండి విష్ణుచారి, కోశాధికారిగా తాటికొండ శ్రీరాములు ఎన్నికయ్యారు. ఆదివారం నామాలగుండులోని బీఎన్ఆర్ గార్డెన్లో సంఘం ముఖ్య సలహాదారు మయబ్రహ్మ నర్సింహా అధ్యక్షతన విస్త్రుత స్థాయి సమావేశం జరిగింది. గౌరవాధ్యక్షులు ఎర్రవెల్లి బాలాచారి, మాజీ అధ్యక్షులు కుందారం గణేష్చారి సమక్షంలో నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రాష్ట్ర, జిల్లా కమిటీల కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరయ్యారు. కమ్మరి, వడ్రంగుల కర్రకోత మిషన్లకు షరతులు లేకుండా లైసెన్సులు మంజూరు చేయాలనీ, రైతు బంధు తరహాలో ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వృత్తిదారులకు ఉచితంగా ఎకరం భూమి ఇవ్వాలనీ, దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయాలనీ, 50 ఏండ్లు నిండిన వృత్తిదారులకు నెలకు రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలని సమావేశంలో కోరారు. 13 డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లకు అందచేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పుల్లోజు అశోక్చారి, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాల అధ్యక్షులు టీ నర్సింహాచారి, ఆదిమూలం వెంకటేష్చారి, నరేంద్రాచారి, శంకరాచారి, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.