Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కేసులా' పుస్తక అవిష్కరణలో
మంత్రి సత్యవతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలుగు సాహిత్యం గిరిజన గడపల దాకా, బంజారాల జీవితాల దగ్గరకు రావటమనేది సాహిత్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో వెలువడిన తొలి బంజారా కథల సంకలనం 'కేసులా' పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు సాహిత్య చరిత్రలోకి అంతగా రాని గిరిజనుల జీవన విధానం, వారి సంస్కృతి, కళలు, వీరోచిత గిరిజన యోధుల చరిత్రలపై గ్రంధాలుగా రావటం హర్షణీయమన్నారు.