Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.రాజ్‌కుమార్,యం.నగేశ్...
గౌరవాధ్యక్షులుగా ఎస్వీ రమ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.రాజ్‌కుమార్, యం.నగేశ్, గౌరవాధ్యక్షులుగా ఎస్వీ రమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సంఘం రాష్ట్ర మూడో మహాసభలు ఇటీవల సంగారెడ్డిలో జరిగాయి. అందులో 43 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఏర్పడింది. 17 మంది ఆఫీస్ బేరర్స్, 25 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. కోశాధికారిగా సుమలత, కార్యనిర్వాహక అధ్యక్షులుగా వి.సుధాకర్, ఉపాధ్యక్షులుగా బి.అనిత, వసియాబేగం, లక్ష్మణ్, శరత్, అంజి, లక్ష్మణాచారి, కార్యదర్శులుగా వెంకటయ్య, అరుణ, రమేష్, సునీత, శ్రీనివాస్, శోభారాణి ఎన్నికయ్యారు. ఐకేపీ వీఓఏలకు కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలనీ, అర్హులైన వీఓఏలకు సీసీఏలుగా పదోన్నతులు కల్పించాలని, గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతి నెల వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తీర్మానించారు. మహిళా విఓఎలకు ప్రసూతి సెలవులు, ఒకే రకమైన యూనిఫాం ఇవ్వాలనీ, రూ.10 లక్షల సాధారణ, ఆరోగ్య భీమా కల్పించాలని, సెర్ప్ నుంచి వీఓఏలకు ఐడీ కార్డులు ఇవ్వాలనే తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.