Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాత్కాలికంగా సంస్కరణలు నిలిపివేత
- ఎన్నికల వేళ ప్రతిఘటన భయాలు
- బడ్జెట్ కసరత్తు షురూ..
నవతెలంగాణ - బిజినెస్ డెస్క్
కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వానికి సార్వత్రిక ఎన్నికల భయం పట్టు కుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ప్రయివేటీకరణ, ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీ విక్రయం, ఎరువుల నగదు బదిలీ పథకం లక్ష్యాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుందని సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల వాటాలను నిరాటంకంగా విక్రయిస్తూ వస్తోన్న మోడీ సర్కార్ తాత్కాలికంగా ఈ ప్రక్రియకు విరామం ఇవ్వనుందని తెలుస్తోంది. కార్పొరేట్లకు అనుకూలమైన సంస్కరణాలను కొద్ది రోజులు పాటు పక్కన బెట్టనుందని సమాచారం. దేశంలో 2024 ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా.. ఈ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం, కార్పొరేట్లకు అనుకూలంగా చేసే నిర్ణయాలు బీజేపీికి పెద్ద ఎదురు దెబ్బగా మారనున్నాయనే సంకేతాలతో తాత్కాలికంగా ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. పీఎస్‌యూల ప్రయివేటీకరణ, వాటాల అమ్మకం వల్ల ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరగనుందని.. ప్రతిపక్షాలు దీన్ని ప్రధాన ఆయుధంగా మల్చుకునే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నట్లు ఎఫ్ఇ ఓ రిపోర్టులో పేర్కొంది. 2023-24నకు సంబంధించిన బడ్జెట్ కసరత్తు ప్రారంభమైంది. ఫిబ్రవరి తొలి వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కీలక ఎన్నికల సమయంలో రాబోతున్న ఈ బడ్జెట్‌పై బీజేపీి ప్రభుత్వం ప్రధాన దృష్టి సారించింది. సాధారణ ఎన్నికలకు ముందు తొమ్మిది రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎలాంటి ప్రతి ఘటనలు రాకుండా ఉండాలంటే.. ఆర్థిక రంగం, వ్యయ సంస్కరణలపై కొంత నెమ్మదిగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ''ఎన్నికలకు ముందర ప్రజలు, ప్రతిక్షాల నుంచి వ్యతిరేకత, ప్రతిఘటనను ఎదుర్కొంటే.. భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుందని బీజేపీిి పాలకులు భావిస్తున్నారు.