Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎంకు పాకాల శ్రీహరిరావు లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతుల్ని ప్రయివేటు అప్పుల నుంచి బయటపడేసేందుకు వీలుగా వారికి రుణాలిచ్చేలా దేశవ్యాప్తంగా బ్యాంకులను ఆదేశించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. రైతుల ఆర్థిక పరిస్థితి దిగజారడానికి ప్రయివేటు అప్పులు, అధిక వడ్డీలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈ భారం నుంచి రైతులను రక్షించడానికి 2004 నుంచి ఆర్ బీఐ అన్ని బ్యాంకులకు ఆదేశిస్తున్నదని గుర్తుచేశారు. అయితే బ్యాంకులు ఇలాంటి రుణాలివ్వడం లేదని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2008లో బ్యాంకులిచ్చే వ్యవసాయ రుణాల్లో మూడు శాతం రుణమార్పిడి చేయాలంటూ ఆదేశించినప్పటికీ, దాన్ని తిరిగి సమీక్షించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.