Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్సు డ్రైవర్, క్లీనర్‌తోపాటు మరొకరు మృతి
- 10 మందికి గాయాలు
నవ తెలంగాణ- కొత్తకోట
చెరుకు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ గరుడ బస్సు వెనుక నుంచి బలంగా ఢకొీట్టడంతో ముగ్గురు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన 44వ జాతీయ రహదారిపై వనపర్తి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తకోట మండలం ముమళ్ళపల్లి 44 జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ గరుడ బస్సు.. చెరుకు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ ఆంజనేయులు(43), క్లీనర్ సందీప్ (35) అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వెంకటపురం గ్రామానికి చెందిన వడ్డే శివన్న(50) ఆస్పత్రిలో చనిపోయారు. మరో పది మంది గాయ పడ్డారు. వారిని వనపర్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతదేహాలను వనపర్తి జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.