Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అధికారం కోసం ఎనిమిది రాష్ట్రాల్లో అడ్డదారులు తొక్కిన చరిత్ర బీజేపీదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ శిక్షణా తరగతుల్లో టీఆర్ఎస్ అధికారం కోసం అడ్డదారులు తొక్కిందంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తాము రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం టీఆర్ఎస్ఎల్పీలో విలీనమయ్యామని తెలిపారు. అయితే బీజేపీ మాత్రం ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనుకున్నది ప్రభుత్వాన్ని కూలగొట్టడానికేనని వివరించారు. కొన్ని పార్టీలో కాలగర్భంలో కలిసిపోతాయనీ, అలాంటి వాటిలో కాంగ్రెస్ పార్టీ ఒకటని విమర్శించారు.