Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న చలి..కొమ్రంభీమ్ జిల్లాలో అత్యల్పంగా 9.3 డిగ్రీలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు, ఒకటెండ్రుచోట మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రం మీదుగా ఈశాన, తూర్పు దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయి. దీంతో చలి ప్రభావం రోజురోజుకీ పెరుగుతున్నది. ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా చల్లని గాలులు వీస్తున్నాయి. కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్ జిల్లాలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ రెండు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీచేసింది.