Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికీ ఆరోగ్యం.. అందుబాటులో ఉచిత వైద్య సేవలు...
- సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆరున్నర దశాబ్దాల్లో ఆరోగ్య రంగంలో సాధ్యం కాని ఎన్నో రికార్డులను తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో సాధించిందని సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు.ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని మహిళలకు ఆశా కార్యకర్తలతో ''ఏ షీల్డ్'' టెస్ట్ కిట్ ద్వారా రక్తహీనత పరీక్షలు నిర్వహించి, ఆ రుగ్మత ఉన్న వారికి వైద్యసేవలను అందించడంతో పాటు పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. అనీమియా ముక్త్ దిశగా రాష్ట్రం అద్బుత ప్రగతి సాధించిందని చెప్పారు. ఆయా జిల్లాలో 14 నుంచి 55 సంవత్సరాలలోపు వారికి రక్తహీనత పరీక్షలు నిర్వహించి, నెలసరిపై కౌమారదశ బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా హైదరాబాద్ డైరెక్టర్ డా.సుభోద్ బృందంతో కలిసి వైద్య శాఖ అధికారులు అనీమియా నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎనిమిదేండ్లలో 12 ప్రభుత్వ వైద్యకళాశాలలను స్థాపించి ఎంబీబీఎస్ సీట్లను 850 నుంచి 2,790కు పెంచుకుని రికార్డు సాధించినట్టు కమిషనర్ తెలిపారు.