Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో భూసమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు వారు వినతిపత్రాన్ని సమర్పించారు. సీఎస్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, వర్కింగ్ ప్రసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, మాజీ మంత్రులు నాగం, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, రాములు నాయక్ తదితరులున్నారు. ధరణిని రద్దు చేసి పాత పద్దతి ని తీసుకురావాలనీ, నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి..పోడు భూములకు పట్టాలు, అర్హులైన వారికి అసైన్డ్ భూముల పట్టాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతు చట్టాంతో పాటు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరారు. టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.