Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షులు యాదయ్యగౌడ్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు రావడం లేదనీ, వాటిని రప్పించేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఈ మేరకు హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటైన తండాలు, చిన్న గ్రామ పంచాయతీలకు ఆరు నెలల నుంచి కేంద్రం నిధులు, మూడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వ నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇవ్వడం, ఇతర పనుల కోసమే ఖర్చులకు నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామంటూ సందీప్‌కుమార్ సుల్తానియా హామీనిచ్చారని యాదయ్యగౌడ్ తెలిపారు.